ఉగాది కానుకగా.. చంద్రన్న జాబ్ క్యాలెండర్..! 7 h ago
ఉగాది పర్వదినాన 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీని ద్వారా ఏపీపీఎస్సీ (APPSC) ఆధ్వర్యంలో 10,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య ఈ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఇప్పటికే 90,607 ప్రభుత్వ, 6.28 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పించామని పేర్కొంటూ.. 20 లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.